Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త‌న పాట రీమిక్స్ చేసి క్రెడిట్ ఇవ్వ‌లేద‌ని మేనల్లుడిపై మండిప‌డుతున్న అనూ మాలిక్‌!

  • `గోల్‌మాల్ అగైన్‌`లో `ఇష్క్‌` సినిమా పాట రీమిక్స్‌
  • `నీంద్ చూరాయి` ట్యూన్ త‌న‌దంటున్న అనూ మాలిక్‌
  • లేదు... ఇంగ్లిషు పాట‌కి కాపీ అంటున్న అమాల్ మాలిక్‌
త‌న ట్యూన్‌ని రీమిక్స్ చేసి క్రెడిట్స్ లో త‌న పేరు ఇవ్వ‌లేద‌ని ఆరోపిస్తూ మేన‌ల్లుడు అమాల్ మాలిక్ పై ప్రముఖ బాలీవుడ్ సంగీత ద‌ర్శకుడు అనూ మాలిక్ మండిప‌డ్డాడు. ఇటీవ‌ల విడుద‌లైన‌ `గోల్‌మాల్ అగైన్‌` చిత్రం కోసం సంగీత ద‌ర్శ‌కుడు అమాల్ మాలిక్‌, `ఇష్క్‌` సినిమా కోసం అనూ మాలిక్ కంపోజ్ చేసిన అల‌నాటి `నీంద్ చూరాయి` పాట‌ను రీమిక్స్ చేశాడు. అయితే ఆడియోలో ఒరిజిన‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా త‌న పేరు ప్ర‌స్తావించ‌క‌పోవ‌డంతో అనూ మాలిక్ అసంతృప్తి వ్య‌క్తం చేశాడు.

`పాట‌ను ఎలా కావాలంటే అలా మార్చుకోండి. కానీ ఒరిజిన‌ల్ ట్యూన్ ఇచ్చిన వారిని మ‌ర్చిపోవ‌డం స‌బ‌బు కాదు. అమాల్ బాగా ఎద‌గాల‌ని నేను కోరుకుంటాను. కానీ ఆడియోలో నా పేరు లేక‌పోవ‌డం వ‌ల్ల యువ‌త‌రానికి నా గురించి తెలియ‌క త‌ప్పుగా అర్థం చేసుకునే అవ‌కాశం ఉంది` అని అనూ మాలిక్ అన్నాడు.

అయితే అనూ మాలిక్ ఆరోప‌ణ‌లపై అమాల్ మాలిక్ మ‌రో ర‌కంగా స్పందించాడు. `ఆయ‌న‌ అనుమ‌తి తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న కూడా ఈ పాట ట్యూన్‌ను ఇంగ్లిషులో లీనియ‌ర్ పాడిన‌ `సెండింగ్ ఆల్ మై లవ్‌` స్ఫూర్తితో రూపొందించాడు. మేం కూడా ఇంగ్లిషు పాట హ‌క్కుల‌ను తీసుకున్నాం. అయినప్పటికీ, ఈ పాట‌ను రీమిక్స్ చేసే ముందు అంకుల్ అనుమ‌తి తీసుకోవాల‌నుకున్నాం. అసలు రీమిక్స్ కూడా ఆయ‌న‌తోనే పాడించాల‌నుకున్నా. కానీ నా కాల్స్‌కి ఆయ‌న స్పంద‌న ఇవ్వ‌లేదు. దీంతో వ‌దిలేశా` అని అమాల్ మాలిక్ తెలిపాడు.
anu malik
amaal malik
golmaal again
neend churayi
sening all my love
linear

More Telugu News